ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

జనవరి, 2023లోని పోస్ట్‌లను చూపుతోంది

టీఆర్‌ఎస్‌ ప్యాకేజీ తీసుకున్న ఆంధ్రుల ద్రోహి జగన్‌

 టీఆర్‌ఎస్‌ ప్యాకేజీ తీసుకున్న ఆంధ్రుల ద్రోహి జగన్‌ - జనసేన నాయకులు గురాన అయ్యలు  విజయనగరం : గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ దగ్గర ప్యాకేజీ తీసుకుని, అధికారంలోకి వచ్చిన తరువాత ఆస్తులను తెలంగాణాకు దారాదత్తం చేసిన ఆంధ్రుల ద్రోహి జగన్మోహన్‌రెడ్డి అని జనసేన నాయకుడు గురాన అయ్యలు ఆరోపించారు. ఈమేరకు శుక్రవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. కేసీఆర్‌ దత్త పుత్రుడు సీఎం జగన్‌ అని రాష్ట్ర ప్రజలు మాట్లాడుకుంటున్నారన్నారు. తెలంగాణ మంత్రులు నోటికి వచ్చినట్లు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం గురించి, పాలన గురించి మాట్లాడుతుంటే వైసీపీ నాయకులు ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు. సీఎం జగన్‌ కేసీఆర్‌ చేతిలో కీలుబొమ్మ అన్నారు. అత్యున్నత భావాలు కలిగి నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం గురించి అలోచించే తమ నాయకుడు పవన్‌ కల్యాణ్‌ గురించి వైకాపా నాయకులు విమర్శలు చేయడం విచారకరమన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వా సలహాదారో? వైసీపీ పార్టీ సలహాదారో? అర్ధం కావడం లేదన్నారు. ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సజ్జల ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని ఏదో చెప్పగలరా అని నిలదీశారు. జనసేన పొత్తుల గురించి వైసీపీ నాయకులకు అనవసరమన్నారు. పొత్...

జనవరి 26న రీ-రిలీజ్ కాబోతున్న బద్రీ?

  జనవరి 26న రీ-రిలీజ్ కాబోతున్న బద్రీ? ఇప్పుడు టాలీవుడ్ లో రీ - రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే... సెప్టెంబర్ 1 న పవన్ కల్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా జల్సా సినిమా రీ - రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.. అయితే ఆ సినిమా కి అభిమానులు ఎంత లా ఎంజాయ్ చేసారో చూశాం, కలెక్షన్స్ భారీగా వసూలు చేసిన విషయం కూడా తెలిసిందే.. రీసెంట్ గా డిసెంబర్ 31న ఖుషీ సినిమా రీ - రిలీజ్ అయిన విషయం కూడా తెలిసిందే అయితే ఆ సినిమా రిలీజ్ అయ్యి వారం రోజులు అవుతున్న సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తూ పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏంటో తెలిసేలా చేస్తున్నది..  పవన్ కళ్యాణ్ పూరీ జగన్ కాంబో లో వచ్చిన బద్రీ సినిమా ఆ రోజుల్లో ఎంత పెద్ద సూపర్ హిట్ అయ్యిందో తెలిసిందే... అయితే ఆ సినిమా నీ మళ్ళీ రీ - రిలీజ్ చేయాలి అని చిత్ర బృందం భవిస్తుంది అట్ట కాకపోతే అది ఎప్పుడూ అనేది ఇంకా డేట్ ఫిక్స్ కాలేదు కాకపోతే జనవరి 26న రీ - రిలీజ్ కాబోతుంది అంటూ సోషల్ మీడియా లో  ఒక ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవుతుంది   

యువశక్తిలో మీ గళం వినిపించండి🎤

 యువశక్తిలో మీ గళం వినిపించండి 🎤 * యువ గళాన్ని వినిపించడమే లక్ష్యంగా జనసేన పార్టీ జనవరి 12వ తేదీన శ్రీకాకుళం జిల్లా, రణస్థలంలో తలపెట్టిన ‘యువ శక్తి’ కార్యక్రమంలో సామాన్య యువతీ, యువకులు వేదిక నుంచి మాట్లాడేందుకు అవకాశం. * దీనిలో పాల్గొనేందుకు జనవరి 5వ తేదీ నుంచి 8వ తేదీలోపు యువతీయువకులు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. * మీ పేరు, వివరాలు నమోదు చేయాల్సిన ఫోన్ నంబరు  08069932222, ఈ– మెయిల్ vrwithjspk@janasenaparty.org కు వివరాలను పంపాలి. * వాయిస్ రికార్డర్ ద్వారా పని చేసే ఈ ఫోన్ నంబరులో యువతీయువకులు ఏ అంశం మీద మాట్లాడాలి అనుకుంటున్నారో క్లుప్తంగా వాయిస్ రికార్డు చేసి చెప్పవచ్చు, లేదా ఈ - మెయిల్ కు తగిన వివరాలను పంపవచ్చు. యువత అంతా పవన్ సీఎం కావాలి అనుకుంటున్నారు అంటూ ఎంత బాగా చెప్పిందో చూడండి  Terms of Use         Privacy Policy

పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్తూ భావోద్వేగానికి గురైన చిరంజీవి గారు

  » పవన్ కల్యాణ్ పై అనేక రకాల విమర్శలు వస్తూ ఉంటాయి. వాటిని విన్నప్పుడు మీకెలా అనిపిస్తుంది ? చిరంజీవి గారి చెప్పిన సమాధానం : చాలా బాధ కలుగుతుంది. వాడు నాకొక కిడ్ బ్రదర్. బిడ్డలాంటి తమ్ముడు. వాణ్ణి నా చేతులతో ఎత్తుకొని పెంచా. వాడికి నేను, సురేఖ తల్లితండ్రులలాంటి వాళ్లం! వాడికీ మేమంటే అంతే ప్రేమ. కించిత్ స్వార్థం కూడా లేని వ్యక్తి. డబ్బు యావ లేదు. పదవీ కాంక్ష లేదు. తన కోసం ఎప్పుడూ ఆలోచించుకోడు. నేను ఒక అన్నగా చెప్పడంలేదు. తనని దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా చెబుతున్నా. అంతెందుకు.. మొన్నటిదాకా వాడికి సొంత ఇల్లు లేదు. "మా అందరికీ ఉన్నాయి.. నువ్వు కూడా కట్టుకో..” అంటే.. "చూద్దాం" అని దాటేసేవాడు.  వేళకు అన్నం తినడు. బట్టలు సరిగ్గా వేసు కోడు. సమాజానికి ఏదైనా చేయాలనే తపనతో అన్నీ వదిలే సిన యోగిలాంటి వాడు. అంత చిత్తశుద్ధి, నిజాయితీ ఉన్న వ్యక్తి... రాజకీయాలనే మురికి కూపంలోకి వెళ్లాడు. అక్కడ ఉన్న మురికిని ప్రక్షాళన చేయాలనుకుంటున్నాడు. ఆ ప్రయత్నంలో కొంత మురికి తనకు కూడా అంటుకుం టుంది. మురికిని తీసేవాళ్లకు మురికి అంటడం సహజమే కదా! ఒక స్వచ్ఛమైన ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం సహకరించాలి.. ప్...

పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..

  పవన్ ఫ్యాన్స్ కు గుడ్  న్యూస్.. థియేటర్లలోకి రాబోతున్న 'తొలిప్రేమ'.. ప్రస్తుతం సినీ పరిశ్రమలో రీరిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోస్ బర్త్ డేస్.. లు విడుదలైన 20 ఏళ్లు పూర్తికావడం ఇలా కొన్ని ప్రత్యేకమైన రోజులలో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను రీ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ జల్సా, ప్రభాస్ నటించి రెబల్, బిల్లా, మహేష్ బాబు పోకిరి, చిరు గ్యాంగ్ లీడర్, త్రివిక్రమ్ నువ్వే నువ్వే చిత్రాలు థియేటర్లలో 43 వెర్షన్ గా సందడి చేశాయి. అంతేకాదు.. కళ్లు చెదిరే కలెక్షన్స్ రాబట్టాయి. ఇక ఇటీవల విడుదలైన పవన్ కళ్యాణ్ ఖుషి ఏకంగా రికార్డ్స్ బద్దలు కొడుతుంది. ఖుషీ కు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. అప్పట్లో సెన్సెషనల్ హిట్గా నిలిచిన ఈ మూవీ.. ఇప్పుడు భారీగా వసూళ్లు రాబడుతుంది. 4కె రెజల్యూషన్ తో విడుదలైన ఖుషీ కు అద్భుతమైన స్పందన వస్తున్న క్రమంలో పవన్ ఫ్యాన్స్ కు మరో కిక్ ఇచ్చే న్యూస్ రెడీ చేస్తున్నారు. మేకర్స్. ఆయన నటించిన మరో బ్లాక్ బస్టర్ చిత్రాన్ని రీరిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. పవన్ కెరీర్ మలుపుతిప్పినల్లో తొలిప్రేమ ఒకటి. ఫ్యామిలీ ఆడియన్స్ కు మాత్రమే కాకుం...

JanaSena Chief Sri #PawanKalyan garu launched JanaSena Yuvashakthi poster.JanaSena Yuvashakthi, 12th Jan 2023, Ranasthalam, Srikakulam District.

 JanaSena Yuvashakthi ఈ నెల 12వ తేదీన శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో నిర్వహించే యువశక్తి కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరించిన జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు. ఈ సందర్భంగా శ్రీ Pawan Kalyan  గారు మాట్లాడుతూ.. • స్వామి వివేకానంద జయంతి నాడు జనసేన యువశక్తి కార్యక్రమం ఉంటుంది.  • స్వామి వివేకానంద స్ఫూర్తితో రణస్థలంలో యువశక్తి తమ తడాఖా చూపించబోతోంది. యువతీయువకులు అందరూ ఆహ్వానితులే. • యువత తమ ఆలోచనల గురించి, వారి కష్టాల గురించి, వారి భవిష్యత్ గురించి గళం వినిపించేలా యువశక్తి కార్యక్రమం ఉంటుంది.  • మన యువత మన భవిత అని భావించి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి.

గుంటూరు ఘటన దురదృష్టకరం: పవన్

గుంటూరు ఘటన దురదృష్టకరం : పవన్ AP: గుంటూరు తొక్కిసలాట ఘటన దురదృష్టకరమన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మృతుల ఆత్మలకు శాంతి కలగాలన్న ఆయన.. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు చెప్పారు. కందుకూరు టీడీపీ సభలో 8 మంది మరణించిన ఘటన మరవకముందే గుంటూరులో ముగ్గురు చనిపోవడం ఆందోళనకు గురిచేస్తోందన్నారు. ఇలాంటి కార్యక్రమాల విషయంలో నిర్వాహకులు, పోలీసులు తగిన ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు..

పవన్ కళ్యాణ్ అభిమానులకు కిక్ ఇచ్చే న్యూస్

పవన్ కళ్యాణ్ అభిమానులకు కిక్ ఇచ్చే న్యూస్ పవన్ కళ్యాణ్ అభిమానులకు కిక్కిచ్చే న్యూస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు మరో కిక్కిచ్చే న్యూస్ వచ్చింది. పవన్ కు స్టార్డమ్ తెచ్చి, అతడి కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన 'తొలి ప్రేమ' సినిమా మరోసారి విడుదల కాబోతోంది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14, 2023న ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. కాగా, నిన్నే 'ఖుషి' రీరిలీజ్ అవ్వగా.. పవన్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న గబ్బర్ సింగ్ సినిమాను విడుదల చేయనున్నారు. Privacy Policy          Terms of Use        Terms and Conditions                 About Us.