» పవన్ కల్యాణ్ పై అనేక రకాల విమర్శలు వస్తూ ఉంటాయి. వాటిని విన్నప్పుడు మీకెలా అనిపిస్తుంది ?
చిరంజీవి గారి చెప్పిన సమాధానం :
చాలా బాధ కలుగుతుంది. వాడు నాకొక కిడ్ బ్రదర్. బిడ్డలాంటి తమ్ముడు. వాణ్ణి నా చేతులతో ఎత్తుకొని పెంచా. వాడికి నేను, సురేఖ తల్లితండ్రులలాంటి వాళ్లం! వాడికీ మేమంటే అంతే ప్రేమ. కించిత్ స్వార్థం కూడా లేని వ్యక్తి. డబ్బు యావ లేదు. పదవీ కాంక్ష లేదు. తన కోసం ఎప్పుడూ ఆలోచించుకోడు. నేను ఒక అన్నగా చెప్పడంలేదు. తనని దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా చెబుతున్నా. అంతెందుకు.. మొన్నటిదాకా వాడికి సొంత ఇల్లు లేదు. "మా అందరికీ ఉన్నాయి.. నువ్వు కూడా కట్టుకో..” అంటే.. "చూద్దాం" అని దాటేసేవాడు.
వేళకు అన్నం తినడు. బట్టలు సరిగ్గా వేసు కోడు. సమాజానికి ఏదైనా చేయాలనే తపనతో అన్నీ వదిలే సిన యోగిలాంటి వాడు. అంత చిత్తశుద్ధి, నిజాయితీ ఉన్న వ్యక్తి... రాజకీయాలనే మురికి కూపంలోకి వెళ్లాడు. అక్కడ ఉన్న మురికిని ప్రక్షాళన చేయాలనుకుంటున్నాడు. ఆ ప్రయత్నంలో కొంత మురికి తనకు కూడా అంటుకుం టుంది. మురికిని తీసేవాళ్లకు మురికి అంటడం సహజమే కదా! ఒక స్వచ్ఛమైన ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం సహకరించాలి.. ప్రొత్సహించాలి.
అయితే మితిమీరి వాడిని అనరాని మాటలు అంటున్నప్పుడు బాధ కలుగుతుంది. పైగా పవన్ ను తిట్టినవాళ్లు మళ్లీ నా దగ్గరకు వచ్చి పెళ్లి ళ్లకు, పేరంటాలకు పిలుస్తారు. రమ్మని బతిమాలతారు. 'నా తమ్ముడిని అన్ని మాటలు అన్నవాళ్లతో మళ్లీ మాట్లాడాల్సి వస్తోందే.. వాళ్లను కలవాల్సి వస్తోందే' అని బాధగా ఉంటుంది.




కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి