పవన్ ఫ్యాన్స్ కు గుడ్
న్యూస్..
థియేటర్లలోకి రాబోతున్న 'తొలిప్రేమ'..
ప్రస్తుతం సినీ పరిశ్రమలో రీరిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోస్ బర్త్ డేస్.. లు విడుదలైన 20 ఏళ్లు పూర్తికావడం ఇలా కొన్ని ప్రత్యేకమైన రోజులలో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను రీ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ జల్సా, ప్రభాస్ నటించి రెబల్, బిల్లా, మహేష్ బాబు పోకిరి, చిరు గ్యాంగ్ లీడర్, త్రివిక్రమ్ నువ్వే నువ్వే చిత్రాలు థియేటర్లలో 43 వెర్షన్ గా సందడి చేశాయి. అంతేకాదు.. కళ్లు చెదిరే కలెక్షన్స్ రాబట్టాయి. ఇక ఇటీవల విడుదలైన పవన్ కళ్యాణ్ ఖుషి ఏకంగా రికార్డ్స్ బద్దలు కొడుతుంది. ఖుషీ కు
ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. అప్పట్లో సెన్సెషనల్ హిట్గా నిలిచిన ఈ మూవీ.. ఇప్పుడు భారీగా వసూళ్లు రాబడుతుంది. 4కె రెజల్యూషన్ తో విడుదలైన ఖుషీ కు అద్భుతమైన స్పందన వస్తున్న క్రమంలో పవన్ ఫ్యాన్స్ కు మరో కిక్ ఇచ్చే న్యూస్ రెడీ చేస్తున్నారు. మేకర్స్. ఆయన నటించిన మరో బ్లాక్ బస్టర్ చిత్రాన్ని రీరిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. పవన్ కెరీర్ మలుపుతిప్పినల్లో తొలిప్రేమ ఒకటి. ఫ్యామిలీ ఆడియన్స్ కు మాత్రమే కాకుండా.. యూత్ కు దగ్గరయ్యేలా చేసింది ఈ మూవీ. అప్పట్లో తొలిప్రేమ పెద్ద సెన్సెషన్. ఇక ఇప్పుడు ఈ మూవీ మళ్లీ థియేటర్లలోకి రాబోతుంది. ఈ ను వాలెంటైన్స్ డే సందర్భంగా 4కె వెర్షన్ రీరిలీజ్ చేయనున్నారట. వచ్చే నెల అంటే ఫిబ్రవరి 14న ఈ ను రిలీజ్ చేయనున్నారట. 1998లో విడుదలైన ఈ అప్పుట్లో బ్లాక్ బస్టర్ హిట్. ఇందులో పవన్ వన్ సైడ్ లవర్ గా కనిపించిన విధానంలో అప్పట్లో యువతను ఆకట్టుకుంది. అంతేకాకుండా.. క్యూట్ లవ్ స్టోరీతోపాటు మంచి కామెడీ సన్నివేశాలు.. మ్యూజిక్ ఇప్పటికీ ఎన్నిసార్లు చూసిన బోర్ కొట్టని తొలిప్రేమ. ఇక ఖుషి తో ఫుల్ జోష్ మీదున్న పవన్ ఫ్యాన్స్ కు ఇది మరో శుభవార్త అనే చెప్పుకొవాలి..


కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి