గుంటూరు ఘటన దురదృష్టకరం : పవన్
AP: గుంటూరు తొక్కిసలాట ఘటన దురదృష్టకరమన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మృతుల ఆత్మలకు శాంతి కలగాలన్న ఆయన.. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు చెప్పారు. కందుకూరు టీడీపీ సభలో 8 మంది మరణించిన ఘటన మరవకముందే గుంటూరులో ముగ్గురు చనిపోవడం ఆందోళనకు గురిచేస్తోందన్నారు. ఇలాంటి కార్యక్రమాల విషయంలో నిర్వాహకులు, పోలీసులు తగిన ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు..

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి