టీఆర్ఎస్ ప్యాకేజీ తీసుకున్న ఆంధ్రుల ద్రోహి జగన్ - జనసేన నాయకులు గురాన అయ్యలు విజయనగరం : గత ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ దగ్గర ప్యాకేజీ తీసుకుని, అధికారంలోకి వచ్చిన తరువాత ఆస్తులను తెలంగాణాకు దారాదత్తం చేసిన ఆంధ్రుల ద్రోహి జగన్మోహన్రెడ్డి అని జనసేన నాయకుడు గురాన అయ్యలు ఆరోపించారు. ఈమేరకు శుక్రవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. కేసీఆర్ దత్త పుత్రుడు సీఎం జగన్ అని రాష్ట్ర ప్రజలు మాట్లాడుకుంటున్నారన్నారు. తెలంగాణ మంత్రులు నోటికి వచ్చినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి, పాలన గురించి మాట్లాడుతుంటే వైసీపీ నాయకులు ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు. సీఎం జగన్ కేసీఆర్ చేతిలో కీలుబొమ్మ అన్నారు. అత్యున్నత భావాలు కలిగి నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం గురించి అలోచించే తమ నాయకుడు పవన్ కల్యాణ్ గురించి వైకాపా నాయకులు విమర్శలు చేయడం విచారకరమన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వా సలహాదారో? వైసీపీ పార్టీ సలహాదారో? అర్ధం కావడం లేదన్నారు. ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సజ్జల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏదో చెప్పగలరా అని నిలదీశారు. జనసేన పొత్తుల గురించి వైసీపీ నాయకులకు అనవసరమన్నారు. పొత్...