జనసేన లోకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి పని చేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారూ ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చారు.. అది ఏమిటి అంటే ఎప్పటి నుంచోవున్న కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకి వచ్చారు.. 2014 లో ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత అయిన రాజకీయాలకు దూరంగా ఉన్నారు..
అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తోంది. అది ఏంటి అంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు జనసేన పార్టీ లో జాయిన్ అవ్వబోతున్నరని ఇందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒపుకున్నట్లు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రెండ్ అవ్వుతుంది. కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం లో నాదెండ్ల మనోహర్ గారు స్పీకర్ గా చేసిన విషయం తెలిసిందే. అయితే వీళ్లిద్దరి మధ్య మంచి స్నేహం వుండటం పార్టీ లో కి రమ్మని నాదెండ్ల మనోహర్ గారు ఆహ్వానించారు అని సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది.. ఏది ఏమైనా కిరణ్ కుమార్ రెడ్డి గారు జనసేన లో కి వస్తే పార్టీ కి మరింత బలం తోడవుతుంది ఇంకా ఎంతో మంది ఇతర పార్టీల నుంచి జనసేన లోకి వచ్చే అవకాశం ఉంది..

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి